Monday, April 29, 2024

Breaking: విలియ‌మ్​సన్​ వీర బాదుడు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్‌..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ పోరు ఈరోజు కొన‌సాగుతోంది. ఆస్ట్రేటియా, న్యూజిలాండ్ పోరాటం జోరుగా సాగుతోంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి కివీస్ 172 ప‌రుగులు చేసింది… ఆస్ట్రేలియాకు 173 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది.

అయితే.. న్యూజిలాండ్‌ను కెప్టెన్ విలియ‌మ్స‌న్ ఆసిస్ బౌల‌ర్ల‌ను ఓ ఆటాడుకున్నాడు. 10 ఓవ‌ర్ల వ‌ర‌కు స్వల్ప స్కోర్‌కే ప‌రిమితం అయిన న్యూజిలాండ్‌.. 10 ఓవ‌ర్లు దాటాక స్కోర్‌ను అమాంతం పెంచేసింది.

విలియ‌మ్స‌న్.. వ‌రుస‌గా ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. విలియ‌మ్స‌న్.. 48 బంతుల్లో 85 ప‌రుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సులు బాది టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొన‌సాగుతోంది. 10 ఓవ‌ర్ల‌లో ఆసిస్ 82 ప‌రుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement