Thursday, May 2, 2024

Breaking : మూడు రాజధానుల బిల్లు విష‌యంలో – ఇచ్చిన‌ మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం – సీఎం జ‌గ‌న్

వికేంద్రీక‌ర‌ణ అంశంపై అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ మాట్లాడారు..ఏ వ్య‌వ‌స్థ అయినా త‌మ ప‌రిధిలో ప‌ని చేస్తేనే ..మిగిలిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌జావుగా జ‌రుగుతాయ‌న్నారు. లేదంటే వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలిపోతాయ‌న్నారు. అస‌లు చ‌ట్టాన్నే వెన‌క్కి తీసుకున్నాం..అయినా దానిపై తీర్పు ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు జ‌గ‌న్. రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌న్న నిర్ణ‌యంతో పాటు..ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీకి చ‌ట్టం చేసే హ‌క్కు లేద‌ని కోర్టు తీర్పు ఇచ్చింది..పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు.

కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే అని ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్‌ కూడా ఫైల్‌ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టిపారేసింది.అయినా నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్‌ చేస్తాయి? అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకుంటే సిస్టమ్‌ మొత్తం కుప్పకూలి పోతుంది. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టుకున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది. శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం అని సీఎం జగన్‌ మరోమారు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement