Sunday, May 5, 2024

Breaking: శానిటరీ ప్యాడ్య్‌తోనే ఆ ప‌ని.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు

ఫారిన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కేరళ కోజికోడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్ విమానంలో 2.4 కిలోల బంగారాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

కాగా, ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి విమానంలో పని చేసే మహిళా సిబ్బందిని అరెస్టు చేశామ‌న్నారు. ఆమెను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు.

అయితే.. షహానా తన శానిటరీ ప్యాడ్స్​లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని అధికారులు తెలిపారు. వాటిని తన లోదుస్తుల్లో దాచిందని చెప్పారు. దీనిపై తమకు సమాచారం అంద‌గా.. విమానం కోజికోడ్​లో ల్యాండ్ అవ్వగానే తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement