Monday, January 30, 2023

Breaking : సీఎం జ‌గ‌న్ తో చ‌ర్చ‌లు సంతృప్తినిచ్చాయి – మెగాస్టార్ చిరంజీవి

సీఎం జ‌గ‌న్ తో 9మంది సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్,పోసాని, నారాయ‌ణ‌మూర్తి, అలీ, నిరంజన్ రెడ్డి, రాజ‌మౌళి,కొర‌టాల‌శివ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చ‌ర్చ‌ల్లో సీఎం జ‌గ‌న్ తో పాటు మంత్రి పేర్నినాని, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అయ్యారు. భేటీ అనంత‌రం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ప‌రిశ్ర‌మ బాగోగులు కూడా ప్ర‌భుత్వం ఆలోచిస్తుంద‌న్నారు. అన్ని వ‌ర్గాల సంతృప్తి కోసం ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌న్నారు. త‌క్కువ రేటుకు వినోదాన్ని అందించాల‌నేదే ప్ర‌భుత్వ ఉద్దేశం అని తెలిపారు. చిన్న సినిమాల గురించి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఆలోచిస్తుంద‌న్నారు చిరంజీవి. టాలీవుడ్ చిత్రాలు దేశంలో పేరుగాంచాయ‌న్నారు. సీఎం జ‌గ‌న్ తో చ‌ర్చ‌లు సంతృప్తిక‌రంగా సాగాయ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement