Friday, May 3, 2024

Breaking : క‌ర్ణాట‌క‌లో నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత – స్కూల్స్ ఓపెన్

క‌ర్ణాట‌కలో నైట్ క‌ర్ఫ్యూని ఎత్తివేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 31నుండి రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ ఉండ‌బోద‌ని సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై నిర్ణ‌యించారు. నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌పై, క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం సార‌థ్యంలో స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కాగా బెంగళూరులోని అన్ని పాఠశాలలు సోమవారం నుండి ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించడానికి అనుమతించాని సమావేశంలో నిర్ణ‌యించారని కర్ణాటక విద్యా మంత్రి బిసి నగేష్ అన్నారు. బెంగుళూరులోని అన్ని పాఠశాలల్లో కోవిడ్ 19 నియ‌మ , నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఆదేశించారు. సినిమా హాళ్లు మినహా హోటళ్లు, బార్‌లు, పబ్‌లలో 50% ఆక్యుపెన్సీకి అనుమతించారు. వివాహాలకు 300 మందిని అనుమతించనున్నారు. మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement