Thursday, May 23, 2024

Breaking : వాట‌ర్ బాటిల్ కి బ‌దులు యాసిడ్ బాటిల్ – ప్రాణాపాయ స్థితిలో విద్యార్థి

వాట‌ర్ బాటిల్ అడిగితే గ‌మ‌నించ‌కుండా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు ఓ దుకాణ‌దారుడు. దాంతో ఓ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ సంఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది. ల‌యోలా కాలేజ్ లో డిగ్రీ చ‌దువుతోన్న చైత‌న్య అనే విద్యార్థికి దాహం కావ‌డంతో దుకాణానికి వెళ్లి వాటర్‌ బాటిల్‌ అడగగా గమనించకుండా యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చాడు. అయితే తీవ్రదాహంతో ఉన్న విద్యార్థి చైతన్య బాటిల్లోని యాసిడ్‌ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థత గురైన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కళాశాల యాజమన్యం విరాళాలు సేకరిస్తుండడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement