Monday, May 6, 2024

Breaking : మ‌రో ఐదురోజులు – కోస్తాంధ్ర‌..తెలంగాణ‌లో వ‌ర్షాలు కురిసే ఛాన్స్

కోస్తాంధ్ర‌..తెలంగాణ‌లో మ‌రో ఐదు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం వెల్ల‌డించింది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణను అతలాకుతలం చేసిన వరుణుడు మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, రేపు జులై 18 తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement