Thursday, May 9, 2024

Breaking : సిటిజ‌న్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ 2.0 స్టార్ట్ – ఇంటి గ‌డ‌ప వ‌ద్ద‌కే ప‌థ‌కాలు – సీఎం జ‌గ‌న్

సిటిజ‌న్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ 2.0ప్రారంభం చేశారు.ఏపీ సేవా పేరుతో పోర్ట‌ల్ ని ప్రారంభించారు. ఈ సేవ‌ల్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకే పోర్ట‌ల్ అని సీఎం జ‌గ‌న్ తెలిపారు. దాంతో వేర్వేరు శాఖ‌ల‌న్నీ ఒకే పోర్ట‌ల్ కింద‌కు వ‌స్తాయి. మారుమూల గ్రామాల్లోనూ సేవ‌ల్లో వేగం పెరుగుతుంద‌ని సీఎం చెప్పారు. గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో సేవ‌లు మ‌రింత వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. గ్రామ స్వ‌రాజ్యానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఇంటి గ‌డ‌ప వ‌ద్ద‌కే ప‌థ‌కాల‌ను అందిస్తున్నామ‌న్నారు. ఈ మేర‌కు వాలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగులు గొప్పగా ప‌ని చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ సేవ‌ల్ని మ‌రింత మెరుగుప‌రిచేందుకే పోర్ట‌ల్ అని జ‌గ‌న్ వివ‌రించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా 3.46కోట్ల మందికి మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. పౌర సేవ‌లు మ‌రింత వేగంగా జ‌రుగుతాయ‌ని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement