Tuesday, May 14, 2024

శ్రీవిష్ణు చిత్రం ‘భ‌ళా తంద‌నాన’ – టీజ‌ర్ రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్

హీరో శ్రీవిష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం భ‌ళా తంద‌నాన‌. వారాహి బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రానికి చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10:24 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తుంది. శ్రీవిష్ణు కి జోడీగా కేథరిన్ న‌టిస్తోంది. విల‌న్ పాత్ర‌లో ‘గరుడ’ రామ్ న‌టిస్తున్నాడు. మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. టైటిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement