Monday, May 6, 2024

Breaking : బప్పి లహరి అంత్యక్రియలు – ఘ‌నంగా వీడ్కోలు

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ‌ప్పి ల‌హ‌రి అంత్య‌క్రియ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. బ‌ప్పీ ల‌హ‌రి కుమారుడు బప్పా లాహిరి తన కుటుంబంతో US నుండి ముంబైకి చేరుకున్నారు. అనంత‌రం బప్పి లహరి కుమారుడు బప్పా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. లహరి కుటుంబ సభ్యులతో పాటు, చిత్ర నిర్మాత బిస్వజిత్ ఛటర్జీ, రాణి ముఖర్జీ సోదరుడు రాజా, నటుడు షర్బానీ ముఖర్జీ అతని అంత్యక్రియల్లోపాల్గొని నివాళులర్పించారు. షర్బానీతో పాటు ఆమె సోదరుడు సామ్రాట్ కూడా ఉన్నారు. ప‌లు అనారోగ్య‌ సమస్యలతో చికిత్స పొందుతున్న బప్పి లహరి ఒక నెల పాటు ఆసుపత్రిలో ఉన్నారు, మంగళవారం రాత్రి స్లీప్ అప్నియాతో మరణించించారు.బప్పి లాహిరి స్వరపరిచిన అనేక పాటలకు పాడిన గాయకులు అల్కా యాగ్నిక్ , ఇలా అరుణ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement