Thursday, May 2, 2024

బాలీవుడ్ న‌టి కాజోల్ – మూడ‌వ‌సారి త‌ల్లి కానుందా !

బాలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత కరణ్ జోహార్ పార్టీలో మెరిసింది బాలీవుడ్ న‌టి కాజోల్.ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా కరణ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో కాజోల్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. దాంతో కాజోల్ ని ఫొటోల‌తో బంధించారు ఫొటోగ్రాఫ‌ర్స్. ఆమెకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు, కాజోల్ గర్భవతి అని ఊహాగానాలు చేస్తున్నారు. దాని వెనుక ఉన్న నిజం ఏమిటి. నిజానికి, పార్టీలో కాజోల్ బ్లాక్ ఆఫ్ షోల్డర్ బాడీ హగ్గింగ్ డ్రెస్ వేసుకుంది. ఈ పార్టీలో కాజోల్ డ్రెస్ తో పాటు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.. కాజోల్ ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోందని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. కాజోల్ ఇప్పటివరకు అలాంటి ప్రకటనేమీ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement