Tuesday, April 30, 2024

బ్లాక్ ఫంగస్ నివారణకు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

దేశంలో ఒక్కసారిగా బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు. కరోనా బాధితులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండడంతో.. ఆదిలోనే దానిని గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు దానిపై అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టొచ్చన్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ఆయన ట్విట్టర్‌లో పలు వివరాలను పంచుకున్నారు.

బ్లాక్ ఫంగస్ ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వాళ్లకే సోకుతోంది. ఇతర జబ్బులున్న వారికి, వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, మధుమేహం అతిగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయిన వారికి, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతోంది. కళ్లు, ముక్కు ఎరుపెక్కడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏం చేయాలి?

★ మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో పెట్టుకోవాలి.
★ మధుమేహంతో బాధపడేవారు కోవిడ్ సోకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
★ స్టెరాయిడ్లను పద్ధతి ప్రకారం వాడాలి.
★ ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వాడాలి.
★ చికిత్సలో మోతాదు ప్రకారమే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్స్ వాడాలి.

ఏం చేయకూడదు?

- Advertisement -

★ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండడం
★ కరోనా సోకి చికిత్స తీసుకునేటప్పుడు ముక్కులు మూసుకుపోతే బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ అనుకోవడం.
★ బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం.

Advertisement

తాజా వార్తలు

Advertisement