Monday, April 29, 2024

Breaking : ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఆందోళ‌న‌లు..ఢిల్లీ వెళ్ల‌నున్న ‘ఈట‌ల‌’..

ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగాల‌ని బిజెపి నిర్ణ‌యించింది. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసింది. న‌వంబ‌ర్ 4త‌ర్వాత ద‌ళిత‌బంధును ఎవ‌రు ఆప‌లేర‌ని..టీఆర్ ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించార‌ని ..ఈ మేర‌కు కేసీఆర్ త‌న మాట‌ని నిల‌బెట్టుకోవాల‌ని బిజెపి డిమాండ్ చేసింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ద‌ళిత గ‌ర్జ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని బిజెపి నేత ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కనబరచడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఈటలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కాల్ చేసి అభినందించారు కూడా.

ఈటల బిజెపి నేత‌గా గుర్తింపు పొందారు కానీ ఆయ‌నకి ఫ‌లానా ప‌ద‌వి అని కేటాయించ‌లేదు అధిష్టానం. ఈ మేర‌కు ఈట‌ల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటల గెలుపు అనంతరం బీజేపీలో జోష్ మరింత ఎక్కువైంది. ఈటల చరిష్మాతోనే ఉప ఎన్నిక బీజేపీ వశమైంది. కాగా బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో అధిష్టానం సైతం భవిష్యత్ కార్యాచరణకు ఇదే దూకుడును కొనసాగించాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోలార్ విద్యుత్ కొనుగోలులో గోల్ మాల్ జ‌రిగింద‌ని ఆరోపించారు ప‌య్యావుల. అదానీల కోసం జ‌గ‌న్ స‌ర్కార్ స్కామ్ కి పాల్ప‌డింద‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement