Tuesday, May 14, 2024

మార్లిన్ మ‌న్నోపై బ‌యోపిక్ – ట్విట్ట‌ర్ ట్రెండింగ్ లో ట్రైల‌ర్

ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. కాగా హాలీవుడ్ హీరోయిన్, మోడల్‌‌‌, సింగర్ గా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మార్లిన్ మన్రో జీవిత చ‌రిత్ర తెర‌కెక్కుతోంది. హాలీవుడ్‌‌‌‌ను అంతలా శాసించిన మన్రో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ఆమె మరణం ఇప్పటికీ రహస్యమే. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చినా, అది హత్యే అనే అనుమానాలున్నాయి. ఈ విషయంపై ఇప్పుడు కాస్త క్లారిటీ లభించే అవకాశాలు కనిపిస్తోంది. తెరపై వెలుగులు పంచిన మన్రో జీవితంలోని చీకటి, విషాదాలు అభిమానులకు తెలియనున్నాయి.

ఎందుకంటే ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. ‘బ్లాండ్‌‌‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పానిష్ నటి ఆనా డి అర్మాస్ మార్లిన్‌‌‌‌గా నటిస్తోంది. జాయిస్ క్యారల్ ఓట్స్ రాసిన నవల ఆధారంగా ఆండ్రూ డొమినిక్ దీన్ని తీస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో విడుదల కానుంది.ఇందులో మన్రో గ్లామర్‌‌‌‌‌‌‌‌నే కాకుండా ఆమె జీవితంలోని సంఘర్షణను కూడా చూపించే సన్నివేశాలున్నాయి. మన్రో జీవిత విశేషాల గురించి ఇంకా ఏం చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో మొదలైంది. ట్రైలర్ విడుదలై రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement