Monday, April 29, 2024

భోజ్‌పురి పాటకి స్టెప్పులేసిన బీహార్ పోలీసు అధికారులు – వైర‌ల్ గా వీడియో

భోజ్ పురి సాంగ్ కి డ్యాన్స్ వేశారు బీహార్ పోలీసు అధికారులు. డిజి, ఎడిజి , డిఐజి స్థాయి అధికారులు భోజ్‌పురి పాటలకి చిందేశారు. అంతేకాదు ఓ పోలీసు అధికారి మైక్ పట్టుకుని పాట కూడా పాడారు. పాట్నాలో, పోలీసు వారోత్సవాల ముగింపు కార్యక్రమం కారణంగా, బీహార్ డిజి ఎకె అంబేద్కర్ పాట్నాలో భోజ్‌పురి పాట ‘కాలీ కోయాలియా రాజా జీ’ పాడారు..డిజి వినయ్ కుమార్ వేదికపై చప్పట్లు కొట్టడానికి పైకి ఎక్కారు. అదే సమయంలో, ADG రవీంద్ర శంకరన్ , DIG ఛత్రనీల్ సింగ్, DG AK అంబేద్కర్ భోజ్‌పురి పాటలు , డీజే ట్యూన్‌లకు డ్యాన్స్ చేశారు..బీహార్ డీజీ, ఏడీజీ, డీఐజీ ర్యాంక్ అధికారికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతోంది.సీఎం నితీశ్‌కుమార్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరై, మంచి పనిచేసిన పలువురు పోలీసులను సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement