Tuesday, May 21, 2024

ప్రారంభ‌మైన తెలంగాణ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం

భారతీయ జనతా పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ప్రారంభ‌మైంది. ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమ‌య్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇప్పటికే బయట టీఆర్ఎస్ పై యుద్దం చేస్తున్న బీజేపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు పై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. అక్రమ కేసులను బనాయిస్తూ విపక్ష నేతలను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అభిప్రాయపడుతుంది. కాగా ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. మొన్నటి వరకూ మంత్రిగా, టీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ తొలిసారిగా విపక్ష స్థానంలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈ స‌మావేశానికి ర‌ఘునంద‌న్ రావు డుమ్మా కొట్టారు. అధికారిక కార్య‌క్ర‌మాలుండ‌డంతో రాలేద‌ని తెలిపారు. ఫ్లోర్ లీడ‌ర్ ను మార్చాల‌ని నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement