Monday, April 29, 2024

BIGG BOSS: గెట్ రెడీ.. ఓటీటీలో 24 గంటలు ‘బిగ్ బాస్’ సందడి!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచనుంది. ఇప్పటికే ‘స్టార్ మా’లో బాగ్ బాస్ 5 సిరీస్ లు విజయవంతం అయ్యాయి. ఈ షో రేటింగ్ లోనూ దూసుకుపోయింది. అయితే, గతంలో కేవలం గంట మాత్రమే ప్రసారం అయిన ఈ షో ఇప్పుడు 24 గంటలపాటు నాన్ స్టాప్ గా సందడి చేయబోతోంది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తెస్తోంది.
 
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు(ఫిబ్రవరి26) సాయంత్రం 6 గంటల నుంచి “బిగ్ బాస్” ప్రారంభం కానుంది.  అయితే, ఈ సారి హౌస్ లో ఎవరు ఉండబోతున్నారు ?అన్నది ఇంకా సస్పెన్స్ గా నే ఉంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో అందరికి నచ్చింది.  “నో కామా… నో ఫుల్ స్టాప్… బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్” అంటూ ఈ షోపై హైప్ పెంచారు. ఓటీటీలో 24 గంటలు అల్లరించనున్న “బిగ్ బాస్” షోకి కింగ్ నాగార్జననే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
 

Advertisement

తాజా వార్తలు

Advertisement