Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 06
06
న చైతద్విద్మ: కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయు: |
యానేవ హత్వా న జిజీవిషామ:
తే వస్థితా: ప్రముఖే ధార్తరాష్ట్రా: ||

తాత్పర్యము : వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించయుండుట వ్యర్థము. అయినప్పటికినీ వారిపుడు యుద్ధరంగమున మా యెదుట నిలిచియున్నారు.

భాష్యము : అర్జునుడు క్షత్రియుడిగా యుద్ధముచేసి అనవసరమైన హింసకు పాల్పడవలెనా ? లేదా యుద్ధము విడనాడి భిక్షాటన చేయవలెనా ? అని ఆలోచింపసాగెను. యుద్ధములో అయిన వారందరినీ సంహరించిన తనకేమి ప్రయోజనము కలుగును ? వారు లేకుండా తాను రాజ్యమును ఎలా అనుభవింపగలడు ? ఈ ఆలోచనల ద్వారా అర్జునుడు చాలా గొప్ప భక్తుడని, కోమల హృదయుడని అర్థమగుచున్నది. రాజవంశములో పుట్టి కూడా భిక్షాటనకు సిద్ధమయ్యాడంటే అతని వైరాగ్యమునకు, అంతేకాక విజయపు అవకాశాలున్నా ఇంతగా విచారించుచున్నాడంటే అతని ఇంద్రయ నిగ్రహమునకు ప్రశంశించవచ్చును. ఈ లక్షణాలే కాక శ్రీ కృష్ణుని ఉపదేశాల పట్ల విశ్వాసము ఉండుంటచే అతడు భగవద్గీతను వినుటకు, ముక్తిని పొందుటకు సరైన వ్యక్తి అని అర్థమగుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement