Friday, May 3, 2024

Big story: ఏడేళ్లలో ఎన్నో మైలురాళ్లు.. సాగునీటి భరోసాతో పచ్చటి పొలాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం సాగునీటిరంగంలో వికసించింది. ఏడేళ్ళలో ఊహకందని రీతిలో ముందడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రం లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సాగునీటిరంగం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రథమ ప్రాధాన్యం దక్కడంతో దశాబ్దాల పాటు సమయం పట్టే ప్రాజెక్టులు ఏళ్ళు తిరక్కుండానే పూర్తవుతూ.. భవిష్యత్తుపై ఆశలు పెంచాయి. ఉత్తర తెలంగాణకు ఇపుడు సమృద్ధిగా నీరందుతుండగా, దక్షిణ తెలంగాణకూ మునుపటి గోసలేదు. ఇంకా అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో తుదిదశలో ఉన్నాయి. ఇపుడు.. ప్రతి జిల్లాకు జలధీమా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, వ్యూహరచన, తెలంగాణ సాగునీటిరంగ ఇంజనీర్ల కృషి.. రైతుల సహకారంతో తక్కువ కాలంలోనే తెలంగాణ జలసాధికారిత సాధించింది.

ఇపుడు సాగునీరందక పంటచేలు ఎండాయని.. వస్తున్న సమస్యలు దాదాపులేవు. ఒకప్పుడు ఒక పంట.. రెండు పంటలు కాదు ఏళ్ళకేళ్ళు సాగునీటి కోసం ఎదురు చూసిన దృష్టాంతాలు అనేకం. ఇపుడు ఆ బాధ లేదు. 24గంటలు కరెంట్‌ ఇస్తున్నట్లుగానే, సమయానికి నీరు అందుతుందన్న భరోసాను సర్కారు ఇవ్వగలిగింది. పక్క రాష్ట్రంతో జలవివాదాలున్నా.. హక్కు విషయంలో నిక్కచ్చిగా ముందుకుపోతూ తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తోంది.

నాడు పదేళ్ళలో రూ.3,800 కోట్లు.. ఇపుడు ఏడేళ్ళలో రూ.1.59 లక్షల కోట్లు..

తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో వేసిన మైలురాళ్ళు, జరిగిన వృద్ది అనూహ్యం. 2004-14 వర కు తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 3,800 కోట్లు కాగా, 2014-21 ఏడేండ్ల కాలంలో తెలంగాణ సర్కారు మేజర్‌, మైనర్‌, మీడియం ప్రాజెక్టు లన్నింటిపై వెచ్చించిన మొత్తం 1.59 లక్షల కోట్లు. ప్రతీ ఎకరాకు సాగు నీరందించాలన్న తపన, దృఢలక్ష్యంతోనే ఇది సాకారమైంది.

తెలంగాణలో గడచిన ఏడేళ్ళలో.. అనేక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మారి.. రైతుల కళ్ళల్లో సంతోషం నింపాయి. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, మిడ్‌మానేర్‌, సింగూరు కెనాల్స్‌, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్‌ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేసి సాగునీరు అందిస్తోంది
.
కాళేశ్వరం ప్రాజెక్టు. ఉత్తర తెలంగాణ జీవధార కాళేశ్వ రం ప్రాజెక్టు. కరీంనగర్‌, ఉమ్మడి మెదక్‌, వరంగల్‌ జిల్లాలను సస్యశ్యా మలం చేస్తూ.. నల్లగొండ జిల్లా కూ భరోసానిచ్చిన ప్రాజెక్టు ఇదీ. కాళేశ్వరంతో పాటు, చనాకాకొ రాట బరాజ్‌, సమ్మక్కసారక్క బరాజ్‌, భక్తరా మదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలను పూర్తిచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement