Friday, May 3, 2024

Big Story: 21,552 కోట్ల లోటు.. ఈఆర్సీకి విద్యుత్‌ సంస్థల రిపోర్ట్‌.. చార్జీల పెంపు ఉంటుందా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యుత్‌ పంపిణీకి సంబంధించి రెండేళ్ల వార్షిక ఆదాయ లోటును తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ)కి తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (డిస్కంలు) సంస్థలు నివేదిక అందజేశాయి. 2021, -22 వార్షిక సంవత్సరానికి రూ.10,624 కోట్లు, 202-2, -23సంవత్సరానికి రూ.10,928 కోట్ల లోటును ఈఆర్‌సీకి ఇచ్చిన నివేదికలో లోటును డిస్కంలు చూపించాయి. అంటే రెండేళ్లకు మొత్తం రూ.21,552 కోట్ల మేర ఆదాయలోటు ఉండనున్నట్లు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ (ఎస్పీ డీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌) సంస్థలు అంచనా వేశాయి. 2021-, 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ డీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ (డిస్కంలు) కలిసి రూ.45, 618 కోట్ల ఆదాయ అవసరాల నివేదిక ఉంటుందని అంచనా వేశాయి. అయితే డిస్కంలకు వచ్చింది మా త్రం ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ.5,652 కోట్లతో కలిపి రూ.34,995 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 2021,-22 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు వేసుకున్న ఆదాయ అంచనాకు రూ.10,624 కోట్ల ఆదాయం లోటు ఉన్నట్లుగా ఈఆర్సీకి ఇచ్చిన నివేదికలో పేర్కొ న్నా యి. ఈ ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు విద్యు త్‌ వినియోగదారులపై చార్జీల భారం వేయాల్సి ఉంటుంది.

2022,-23 ఆర్థిక సంవత్సరానికి కూడా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌) కలిపి రూ.53,053 కోట్ల అంచనాతో ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి నివేదించాయి. ఇందులో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు సంబంధించి రూ.5,652 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఆదాయ లోటు కూడా రూ.36,476 కోట్లు ఉంటుందని డిస్కం లు నివేదించాయి. అంటే సబ్సిడీ, వినియోగదారుల నుంచి వచ్చే మొత్తం కలిపి రూ.42,128 కోట్ల ఆదా యం ఉంటుందని అంచనా వేసినప్పటికి లోటు కూడా రూ.10,928 కోట్లు ఉంటుందని ఆదాయ అవ సరాల నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఆదాయ అవసరాల వార్షిక నివేదికను ఏడాది ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది. 2021-, 22 వార్షిక సంవత్సరానికి సంబంధించి గతేడాది నవరంబర్‌ 30 లోగా నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. కొవిడ్‌ ఇతర కారణాల వల్ల ఏడాది చివరలో ఈఆర్సీకి నివేదించారు. 2022 , -23 సంవ త్సరానికి సంబంధించిన డిస్కంల ఆదాయ అవ సరాల నివేదికను మంగళవారం ఈఆర్సీకి డిస్కంలు అందజేశాయి.

చార్జీల పెంపు ప్రతిపాదనను అందజేయని డిస్కంలు..
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి అందజేసినప్పటికి.. విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపానకు సంబంధించి నివే దికను అందజేయలేదు. నవంబర్‌ 30న చార్జీల పెంపునకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఐదారేళ్లుగా ఇవ్వలేదు. నంబవర్‌ 30 వరకు యూనిట్ల వారిగా చార్జీల పెంపునకు ప్రతిపాదనలు ఇస్తే.. ఈ చార్జీల పెంపుపై ప్రతిపాదనపై వచ్చే ఏడాది మార్చి వరకు ప్రజల నుంచి ఈఆర్సీ అభిప్రాయ సేకరణతో సలహాలు, సూచనలు చేపడుతుంది. ఆ తర్వాత ఎంత మేరకు చార్జీలు పెంచాలనే అంశాన్ని డిస్కంలుకు ఈ ఆర్సీ సూచన చేస్తుంది. చార్జీల ప్రతిపాదనకు సం బం ధించి నివేదికను కూడా డిస్కంలు త్వరలోనే అంద జేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

నివేదిక అందగానే అభిప్రాయ సేకరణ: ఈఆర్సీ చైర్మన్‌ శ్రీరంగరావు
విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించి ప్రతి పాదనల నివేదిక విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి అందలేదని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులెటరీ కమిషన్‌ చైర్మన్‌ టి.శ్రీరంగరావు తెలిపారు. మంగ ళవారం ఆయన ఈఆర్సీ కార్యాలయంలో మీడి యాతో మాట్లాడారు. 2021-, 22, 2022-, 23 వార్షిక సంవత్సరాలకు సంబంధించి ఆదాయ అవసరాల నివేదికను డిస్కంలు నివేదించాయని వివరించారు. చార్జీల పెంపునకు సంబంధించి కూడా నివేదిక ఇవ్వా లని ఈఆర్సీ నుంచి నోటీసు ఇచ్చినట్లుగా తెలిపారు. గృహ, వ్యవసాయం, కంపెనీలు, పవర్‌లూమ్‌, లాండ్రీ, ధోబీఘాట్లకు ప్రభుత్వం సబ్సిడీతో విద్యుత్‌ను అందిస్తోందన్నారు. వీటన్నింటికి యూనిట్ల వారిగా ఏ మేరకు చార్జీలు పెంచాలనే అంశంపై డిస్కంల నుంచి వేదిక అందగానే.. ఈ నివేదికపై ప్రజాభిప్రాయ సేక రణ చేపడుతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభి ప్రాయాలను పరిగణలోకి తీసుకుని చార్జీల పెంపు ఏ విధంగా ఉండాలో డిస్కంలకు సూచనలు చేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement