Thursday, April 25, 2024

మ‌ర‌క్కార్ గా మోహ‌న్ లాల్ .. ఆక‌ట్టుకుంటున్న ట్రైల‌ర్ ..

16వ శ‌తాబ్దానికి చెందిన కుంజాలి మ‌ర‌క్క‌ర్ అనే కేర‌ళ పోరాట యోధుడి క‌థ‌గా తెర‌కెక్కుతోంది మ‌ర‌క్కార్. ఈ చిత్రంలో హీరోగా మోహ‌న్ లాల్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ . వంద కోట్ల బ‌డ్జెతో రూపొందుతుంది. ఈ మూవీని పెరంబ‌వూర్ నిర్మిస్తున్నాడు.. ఈ చిత్ర తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఆనాటి చారిత్ర‌క వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్టు చూపించారు ఈ ట్రైల‌ర్ లో. అర్జున్ .. సునీల్ శెట్టి .. సుహాసిని .. కీర్తి సురేశ్ .. కల్యాణి ప్రియదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. మోహ‌న్ లాల్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు.. పాత్ర ఏదైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డంలో మ‌హాదిట్ట‌. ఈ ట్రైల‌ర్ ఈ మూవీపై అంచ‌నాల‌ను పెంచుతోంది..సినిమా ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement