Monday, April 29, 2024

భారీ భ‌ద్ర‌తా లోపం – తాజ్ మ‌హ‌ల్ మీదుగా ఎగిరిన విమానం – రంగంలోకి దిగిన ఏఎస్ఐ

ఆగ్రాలోని తాజ్ మ‌హ‌ల్ పై విమానం ఎగురుతోన్న వీడియో వెలుగులోకి వ‌చ్చింది. దాంతో ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) రంగంలోకి దిగింది. ఏఎస్‌ఐ కేసు దర్యాప్తు ప్రారంభించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నుంచి నివేదిక కోరింది. తాజ్ మహల్ వద్ద విమానం ఎగురుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానం తాజ్ మహల్ మీదుగా ఎగురుతున్న వీడియో 16 సెకన్ల నిడివితో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకాశంలో గర్జిస్తూ తాజ్ మహల్ మీదుగా విమానం ఎలా బయటకు వచ్చిందో ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. దీని కారణంగా, తాజ్ మహల్ కాంప్లెక్స్‌లో పర్యాటకులు ఎగురుతున్న విమానాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 367వ ఉర్స్ రెండవ రోజున తాజ్ మహల్ మీదుగా విమానం ఎగురుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. షాజహాన్ యొక్క మూడు రోజుల ఉర్స్ ఉత్స‌వం ఆదివారం నుండి ప్రారంభమైంది. ఈ కేసులో, ఆగ్రా సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ..విమానం యొక్క వైరల్ వీడియో గురించి మేముంCISF అధికారుల నుండి వ్రాతపూర్వక నివేదికను కోరామ‌న్నారు. నివేదిక వచ్చిన తర్వాత మేము సమాచారం అందిస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement