Thursday, May 2, 2024

Funny Moment | ఇంకెప్పుడు పెండ్లి చేస్కుంటవ్​ రాహులా?.. లాలూ ప్రశ్నకు విరబూసిన నవ్వులు!

బిహార్​లో ఇవ్వాల జరిగిన విపక్ష పార్టీల మెగా భేటీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇంకెప్పుడు పెండ్ల చేసుకుంటావ్​? అని 53 ఏండ్ల రాహుల్​ గాంధీని లాలూ ప్రసాద్​ యాదవ్​ అడగడంతో అక్కడ సరదా సరదాగా నవ్వులు పూచాయి. ‘‘షాదీ కరియే, హమ్ లోగ్ బారాతీ ఛాలెంగే’’ (పెళ్లి చేసుకో, మీ పెళ్లి ఊరేగింపులో మేము కూడా భాగం కావాలనుకుంటున్నాం) అని లాలూ ప్రసాద్​ యాదవ్ అన్నారు. దీంతో వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బిహార్​లోని పాట్నా వేదికగా జరిగిన విపక్షాల భేటీలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్​ యాదవ్​ రాహుల్​ గాంధీ పెళ్లి విషయం లేవనెత్తడంతో అంతా నవ్వులమయం అయ్యింది. చాలా కాలం తర్వాత రాజకీయ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కూడా ఈ ప్రశ్నకు పడి పడి నవ్వారు. దీనికి అతను చాలా చాకచక్యంగా బదులివ్వడం అందరినీ ఆశ్యర్యపరిచింది. “ఇప్పుడు, మీరు చెప్పినట్లు, అది జరుగుతుంది.” అంటూ రాహుల్​ లాలూతో అనడంతో మరోసారి అంతా సరదాగా నవ్వుకున్నారు. “షాదీ కర్ణా చాహియే”ఇంకా సమయం ఉంది అని రాహుల్​ అన్నాడు.

దీంతో లాలూ మాట్లాడుతూ “మీ మమ్మీ తన మాట వినడం లేదని నాకు చెప్పారు” అనడంతో అక్కడున్న వారంతా మరోసారి ముసిముసిగా నవ్వుకున్నారు. “పక్కా కరియే, బాత్ మానియే (ఇప్పుడే నిర్ధారించండి. మా మాట వినండి)” అని లాలూ యాదవ్ అన్నారు. కాగా, జనవరిలో రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో కర్లీ టేల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “సరైన అమ్మాయి వచ్చినప్పుడు” తాను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తన వద్ద “చెక్‌లిస్ట్” ఉందా? అని అడిగినప్పుడు.. “లేదు, కేవలం ప్రేమగల వ్యక్తి కావాలి”అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.  ఇక.. డిసెంబరులో రాహుల్​ గాంధీ ఒక యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి సోనియా గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, తన అమ్మమ్మ వంటి లక్షణాలను తనకు కాబోయే భాగస్వామికి కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement