Wednesday, May 15, 2024

Big Breaking : నీట్ పీజీ కౌన్సెలింగ్ కు సుప్రీంకోర్టు అనుమ‌తి

నీట్ పీజీ కౌన్సెలింగ్ కు సుప్రీంకోర్టు అనుమ‌తిని ఇచ్చింది. ప్ర‌స్తుత రిజ‌ర్వేష‌న్ ప్ర‌కార‌మే కౌన్సెలింగ్ జ‌ర‌పాల‌ని ఆదేశించింది. ఒబీసీల‌కు 27శాతం, ఈడ‌బ్ల్యూ ఎస్ ల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింది. దాంతో నీట్ పీజీ విద్యార్థుల‌కు రిలీఫ్ దొరికింది. ట్‌ పీజీ కౌన్సెలింగ్ 2021 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. NEET-PG కౌన్సెలింగ్‌ను పునఃప్రారంభించేందుకు అనుమతించింది. 2021-22 కోసం NEET-PG అడ్మిషన్లకు సుప్రీంకోర్టు ఓకే చేసింది.

గత వారం దేశ రాజధానిలో జూనియర్ వైద్యులు 14 రోజుల నిరసనను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్ 06 జనవరి 2022 లోపు ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సూచనప్రాయంగా తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రెసిడెంట్ సహజానంద్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. సమ్మె చేస్తున్న జూనియర్‌ వైద్యులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఐఎంఏ కేంద్ర ఆరోగ్య మంత్రి, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా నేడు సుప్రీంకోర్టు నీట్ పీజీ కౌన్సెలింగ్ కి అనుమ‌తినివ్వ‌డం ఊర‌టనిచ్చే అంశంమ‌నే చెప్పాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement