Friday, May 3, 2024

HYD: సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం.. హాజరు కానున్న కేరళ సీఎం

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ప్రారంభమైన సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు కేరళ ముఖ్యమంత్రి పినరయు విజయన్, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్, ప్రకాష్ కారత్, బృందా కారత్, బిమన్ బసు,రామచంద్రన్ పిళ్ళై, సుభాషిణి అలీ, బీవీ.రాఘవులు హాజరు కానున్నారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ పోరాట విజయాలు, పార్టీ అఖిల భారత మహా సభల ముసాయిదా తీర్మానంపై నేతలు చర్చించనున్నారు.

కేంద్ర కమిటీ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చిస్తాం అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. పార్టీ 23వ అఖిల భారత మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తాం అని తెలిపారు. మహా సభల రెండు నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామన్న సీతారం ఏచూరి.. ప్రతి పార్టీ సభ్యుడు ముసాయిదా తీర్మానంపై కేంద్ర కమీటీకి సవరణలు పంపవచ్చు అని చెప్పారు. ఏప్రిల్ లో కేరళలోని కన్నూరులో అఖిల భారత మహా సభలు జరగనున్నాయని వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement