Friday, April 26, 2024

కమలాహ్యారిస్ భర్తని ముద్దాడిన.. బైడెన్ భార్య

అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్..అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్‌ను ముద్దాడారు. తనవైపుగా వస్తున్న జిల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు డగ్ చేయి చాచారు. ఈ క్రమంలోనే జిల్ ఆయనను పెదాలపై కిస్ చేశారు. అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్ ప్రసంగానికి కొన్ని క్షణాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెన్నీ జాన్సన్ అనే జర్నలిస్టు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఏంటీ.. జిల్ బైడెన్ కమల భర్త పెదాలపై ముద్దు పెట్టారా’’ అంటూ కామెంట్ కూడా జత చేశారు. నెట్ లో రిలీజ్ కాగానే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పటివరకూ దీనికి ఏడు లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి. నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో ఎమోజీలు, రకరకాల వ్యాఖ్యల వరద పారిస్తున్నారు. అసలేం జరిగిందో అర్థం కాలేదంటూ చాలా మంది ఎమోజీలు పెట్టారు. తమకు నోట మాటరావట్లేదంటూ మరికొందరు కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement