Sunday, April 28, 2024

Adilabad : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత భరత్ వాగ్మారే

ఆదిలాబాద్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హస్తం పార్టీలోకి పలువురు నేతలు చేరుతున్నారు. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి వంటి నేతలు చేరికతో హుషారుగా ఉన్న కాంగ్రెస్ లోకి నేడు మరో నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు భరత్ వాగ్మారే నేడు హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి హస్తం గూటికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement