Wednesday, May 15, 2024

యుద్ధాన్ని ఆతిథ్యంగా కోరినయోధుడు అశ్వత్థామ

తిథి లేని వాడు ‘అతిథి’. అంటే మంచిరో జు, చెడురోజు, మంచి ముహూర్తము చెడు ము హూర్తములతో సం బంధమేమీలేకుండా ఇంటికి వచ్చేవాడు ‘అతిథి’ అని అర్థం చెప్పబడింది. అయితే, తిథి, వార, నక్షత్రాలను చూసుకుని వచ్చినా, అలాకాకుండా అకస్మాత్తుగా వచ్చినా, ఇంటికి వచ్చిన అతిథి అతిథిగానే మన్నించబడ తాడు తప్ప అందులో ఏమీ బేధం ఉండడానికి వీలులేదన్నది సనాతనంగా ఆచరించబడుతూ న్న ఒక గృహస్థాశ్రమ ధర్మం.
తే.గీ. ఎలమినెవ్వని గృహమునకేఁగుదెంచి
య ఫలితాశుఁడై క్రమ్మఱు నట్టియతిథి
తనదు దుష్కృతమాగృహస్థునకు నిచ్చి
యతని సుకృత మంతయుఁగొనియరుగుఁబుత్ర!
(మారన ‘మార్కండేయ పురాణము’,)
ఇంటికి వచ్చిన అతిథికి మొదట గౌరవపూ ర్వకంగా స్వాగతం పలికి, ఆదరించి, అతడు ఇం ట్లో ఉన్నన్ని రోజులు అన్ని సదుపాయాలూ సమ కూర్చి, క్రమం తప్పకుండా వేళకు అన్ని సపర్య లు చేసి, తిరిగి వెళ్ళేటప్పుడు తనకు కలిగినంత లో సముచితంగా మర్యాద చేసి పంపడం అన్నది ఒక తప్పనిసరి గృహస్థాశ్రమ ధర్మంగా నిర్ణయిం పబడింది. ఆ గృహస్థు ధర్మం ప్రతి ఇంటా క్రమం తప్పక ఆచరింపబడవలెనన్న సదుద్దేశంతో, సం దర్భానికి సరిచూసుకుని వీలైనప్పుడల్లా కవులు తమ కావ్యాలలో ఆ నియమాలను ఉటంకిస్తూ పద్యాలు చెప్పారు. ఏ గృహం నుంచి అతిథి సరి గా ఆదరించబడకుండా తిరిగి వెళ్ళిపో తాడో, ఆ గృహస్థుని ఇంటిలో అతిథి తాను పూర్వం చేసిన చెడ్డ పనుల వలన మూటగట్టుకున్న పాప ఫలా న్ని వదిలిపెట్టి, ఆ గృహస్థుడు అప్పటిదాకా చేసి న మంచి పనుల ఫలితమైన పుణ్యాన్ని తోడుగా తీసుకుని వెళ్ళపోతాడు అని మారన కవి పై ప ద్యంలో చెప్పాడు. ఈ చిత్రమైన సంగతిని మా రన తనంత తానుగా కల్పించి చెప్పినది కాదు. దీనికి మూల శ్లోకాలు అయినట్టివి వ్యాస మహర్షి రచించిన భారతంలో రెండు శ్లోకాలున్నాయి.
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్‌ ప్రతి నివర్తతే
స దత్త్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్ఛతి
(వ్యాసభారతం, శాంతిపర్వం)
‘ఏ గృహస్థుని ఇంటి ద్వారం నుండి భోజ నం దొరకని కారణంగా ఏ అతిథి నిరాశతో మరలి వెళ్తాడో, ఆ అతిథి తన పాపాన్ని ఆ గృహస్థుని ఇం ట వదిలి, ఆ గృహస్థుని ఇంటి పుణ్యాన్ని తన వెం ట తీసుకుని పోతాడు’ అని పై శ్లోకం భావం.
పాత్రంత్వతిథిమాసాద్య శీలాఢ్యం యో న పూజయేత్‌
స దత్త్వా దుష్కతం తస్మై పుణ్యమాదాయ గచ్ఛతి
(వ్యాసభారతం, అనుశాసనిక పర్వం)
‘అన్నివిధాలా పాత్రుడు, సుశీలుడు అయిన అతిథిని ఏ గృహస్థుడైతే యథోచితంగా ఆదరిం చి సత్కరించడో, ఆ గృహస్థునికి ఆ అతిథి తన పా పాన్ని ఇచ్చి ప్రతిగా ఆ గృహస్థుని పుణ్యాన్ని తాను తీసుకుని వెళ్ళిపోతాడు’ అని పై శ్లోకం భావం.
పై రెండు శ్లోకాల భావం ఇంచుమించుగా ఒకటే. ఇంటికి వచ్చిన అతిథి అసంతృప్తుడై వెళ్ళ డం గృహస్థునికి మంచిది కాదు అన్నది ఇందు లో మూల సూ త్రం. ఇందులో అలసత్వానికి ఏ మాత్రం తావులే కుండా, ఈ అతిథి మర్యాద అనే ధర్మాచరణను కఠినంగా అమలుపరచడానికి కవులు చేసిన ప్రయత్నాలే ఇలాంటి భాష్యాలన్నీ అని ఏ సంకో చమూ లేకుండానే చెప్పుకోవచ్చు.
అయితే, ‘ఆతిథ్యం’ అనే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఒక విభిన్నమైన కోణంలో చూపిన సం దర్భం ఆంధ్రమహాభారతం, కర్ణపర్వంలో కనప డుతుంది. కర్ణుడు సర్వసైన్యాధిపతిగా జరిగిన రెండురోజుల యుద్ధంలో, రెండవ రోజు ఇరు పక్షాల వారికీ మధ్య భీకరం సంగ్రామం జరుగు తూండగా, అశ్వత్థామకు అర్జునుడికి మధ్య పోరు ప్రారంభం కానుండగా అశ్వత్థామ ఒక మాట అంటాడు ఈ క్రింది పద్యంలో-
కం. ననుఁదగియెడునతిథింగా
మనంబునఁదలంచి నీవు మన్నించెదవే
నినివచ్చెదనీ పాలికి, ననఘా!
సంగ్రామ మొసఁగుమాతిథ్యముగన్‌.
(కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం)
‘నన్ను నీకు తగిన అతిథిగా భావిస్తే నేను నీ వద్దకు వస్తాను. నీతో యుద్ధాన్ని మాత్రమే నాకు నీవు ఇవ్వవలసిన ఆతిథ్యంగా భావించి నీ వద్దకు వస్తాను. అందువల్ల, యుద్ధాన్నే నాకు ఆతిథ్యం గా ఇవ్వు’- అని అశ్వత్థామ అర్జునుడితో అన్నమా టలు పైపద్యం భావం. ఒక యోధుడు మరొక యోధుడిని తనను ఇంటికి వచ్చిన అతిథిగా భా వించమనీ, యుద్ధం మాత్రమే తనకు అతిథి మ ర్యాదగా ఇవ్వవలసిన ఆతిథ్యమని అడగడం ఇం దులో మనసును ఆకట్టుకునే గొప్ప విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement