Sunday, April 28, 2024

అంతర్ముఖ చైతన్య స్వరూపుడు స్వామి వివేకానంద

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరిం చి, పద్మాసనస్థులైన, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉం చుకుని, అర్థనిమీనేత్రులై ధ్యానమగ్నులై వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృ#హతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌథాన్ని నిర్మించడం, ఆ సౌథంలో చైతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచే యటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరా భ్యాసాన్ని చేస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింప చేసుకుంటూ ఊహాతీ త వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ము ఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్ను డై ఉండేవారు. జ్యోతిర్మయ ప్రకాశంలో జీవిస్తూ చిరు ప్రాయంలోనే సృజనాత్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేర ణలో దివ్య దర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చైతన్యంలో విరాజిల్లే అంతర్ము ఖ చైతన్య స్వరూపుడు. శ్రీ రామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో- న, కర్మ, భక్తి, యోగ మార్గాల లో కానరాని మెరుగులు ఆస్వాదించి వారి వచనా లను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశు ప్రాయులుగా జీవిస్తున్నవారిని మా నవ స్థాయికి ఎదగ చేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసి నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూత న కాంతి పుంజం. ఆ ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భార తదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భార తదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది. ”నేను ఎవరిని? ఆసియా వాసినా? ఐరోపా వాసినా? అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను” అనేవారు స్వామి.
మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో… ”అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు. ఆస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కల లో తగులబెడతారు. పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు.
హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిలబెడతారు. అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు”
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహంచి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చ ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి వివేకానంద. హందూమతాన్ని కించపరిస్తే సహంచేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘటించి హందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ”ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సు ని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానుల కు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి” అనేవారు. ప్రేమ తత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు.
జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకో వడం గమనార్హం. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి తెలిసి విదేశీయులు ఆయనతో సన్నిహతంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుం బాన్ని పరిత్య జించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు.
భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమడింపచేయటాని కి అహర్నిశలు కృషి చేశారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామా లు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగం లోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికత ను గుర్తించమని చెప్పేవారు. హందవుల శాంతి కాముకత్వాన్ని తన అహంసా తత్వంతో వెల్లడి చేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ”ఓ భారత మా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!” అంటూ స్వామి సింహనాదం చేసేవారు.మనలో నిద్రాణమై వున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ”మన జాతీయ ఆత్మన్యూ నతాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకా నంద” అని రాజాజీ పేర్కొన్నారు.
వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి. లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రా రంభించారు.
వివేకానందుడు నిరంతరం మననం చేసుకు నే కఠోపనిషత్తులోని శ్లోకం-

న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం
ులు నేమా విద్యుతో భాంతి కుతో2యమగ్ని:!
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్వభాసా సర్వమిదం విభాతి!!

”అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్ర తారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈ అగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి. దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడు తున్నది.” ”స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవా ల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను” అని మహాత్మాగాంధి అన్నారు.
వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ”పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి’ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశా నిర్దేశం చేశారు. స్వామి వివేకానంద 1902లో జులై 4వ తేదీన తన 39వ యేట మర ణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాథలుగా మార్చివేశారు.
”జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావవాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను” అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement