Monday, May 6, 2024

Puttaparthi : సాయి హీరా కన్వెన్షన్ ను ప్రారంభించిన మోడీ

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ… సత్య సాయిబాబా నడియాడిన పుణ్యభూమికి తాను తప్పకుండా వస్తానన్నారు. ప్రజలను ఆశీర్వదించేందుకు కాదు సత్యసాయి బాబా ఆశీర్వాదం పొందేందుకు అన్నారు. గతంలో గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు పేద, ధనిక తారతమ్యం లేకుండా సత్యసాయిబాబా అందించిన సేవలు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించాయన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాగిజావ పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.

ఇదే స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలని ఆశిస్తున్నానన్నారు. సత్యసాయి బాబా పేరిట ఏర్పడిన జిల్లాను డిజిటలైజేషన్ చేసేందుకు, సాంకేతిక సేవలు అందించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జీ 20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు మన సంస్కృతి సాంప్రదాయాలను శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుంటే మరింత వేగంగా ముందుకెళ్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు సత్యసాయి ట్రస్ట్ అవలంబిస్తున్న సోలార్ పవర్ విధానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. మనం ప్రారంభించిన యోగాను ప్రపంచ దేశాలు అనుసరిస్తుండడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళితే ప్రపంచ దేశాలకు భారత్ ఆది గురువుగా నిలవడం ఖాయమన్నారు. జపాన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్ర, సాంకేతికతతో చిన్నచిన్న అడవులను సృష్టిస్తున్నారన్నారు. హీరా, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా ఇలాంటి అడవులను దేశంలోనూ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement