Wednesday, May 15, 2024

బండి ‘మహా పాదయాత్ర’.. ఎప్పటి నుంచి అంటే..

రాజ‌కీయాల్లో పాద‌యాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. పాదయాత్రలో చరిత్రలు సృష్టించిన నాయకులు ఉన్నారు. పాదయాత్రలతో అధికారంలోకి వచ్చిన సందర్భంగాలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నాడు వైఎస్ పాదయాత్రతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు. అనంతరం 2014కు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దానినే ఫాలో అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అందుకు వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే కారణం.  పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ప్రారంభం కాబోతున్న‌ది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆగస్ట్ 9న ‘మహా పాదయాత్ర’ పేరుతో దీన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆగ‌స్టు 9 నుండి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు తొలివిడ‌త పాద‌యాత్ర‌కు బండి సంజ‌య్ శ్రీకారం చుట్టబోతున్నారు. హైద‌రాబాద్‌లోని చార్మీనార్ నుంచి హుజూరాబాద్ వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మహాపాదయాత్ర అరంభం అవుతుంది. మొత్తం నాలుగు విడ‌త‌ల్లో తెలంగాణ మొత్తం పాద‌యాత్ర చేయనున్నట్లు బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో గ‌డిల పాల‌న‌కు వ్య‌తిరేకంగా, ప్ర‌జాస్వామ్య తెలంగాణ కోస‌మే పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ట్టు బండి సంజ‌య్ చెప్పారు. మహా పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలను ప్రజలందరికీ వివరిస్తాం అని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు భిన్నంగా సాగుతున్న అవినీతి, గడీల పాలనకు తెరదించుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక!

Advertisement

తాజా వార్తలు

Advertisement