Tuesday, May 7, 2024

బండి సంజయ్ కు బెయిల్ మంజూరు – రేపు విడుదల అయ్యే అవకాశం

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది హనుమకొండ కోర్టు. టెన్త్‌ ప్రశ్నాపత్రం బయటికి వచ్చిన వ్యవహారంలో బండి కి భారీ ఉపశమనం లభించింది. ఈ కేసులో హనుమకొండ కోర్టు బెయిల్ ఇచ్చింది నిన్న సంజయ్‌కి హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే బీజేపీ లీగల్ సెల్ టీమ్ సంజయ్ తరఫున హన్మకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చిన వ్యవహారంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వాలని బండి సంజయ్‌ తరపు లాయర్లు వాదించారు. కుట్ర కోణంతో సంజయ్‌ను ఇరికించారని వాదనలు వినిపించారు. విచారణ కీలక దశలో ఉన్నందున.. బండి సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పీపీ కోరారు. అయితే, బండి సంజయ్‌ ఫోన్‌ మిస్సైందని.. అందులో విలువైన డేటా ఉందన్నారు పీపీ. కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటపడతాయన్నారు .

దీనిపై 8 గంటల సుదీర్ఘ విచారణ తరవాత ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుతో జడ్జి కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన కోర్టు చివరికి బండి సంజయ్ కుమార్‌కు బెయిల్ ఇచ్చింది. కస్టడీకి ఇవ్వాలన్న పీపీ వాదనలను కోర్టు పక్కన పెట్టింది .

Advertisement

తాజా వార్తలు

Advertisement