Tuesday, May 7, 2024

బెయిలా.. జైలా? ఎంపీ నవనీత్​ కౌర్​ పిటిషన్​పై రేపు హైకోర్టులో విచారణ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని బెదిరింపులకు పాల్పడిన కేసులో ఎంపీ నవనీత్ కౌర్​, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా జైల్లో ఉన్నారు. కాగా, వారు  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. మసీదు వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పిలుపు ఇవ్వడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అయితే ‘మాతోశ్రీ’ వెలుపల జపించమని పిలుపు ఇవ్వడం వల్ల మతపరమైన ఉద్రిక్తత ఏర్పడదని వారు చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని, దేశద్రోహానికి పాల్పడేంతగా వారు ఏమీ చేయలేదని రాణాల తరఫున న్యాయవాది పొండా కోర్టుకు తెలిపారు.

కాగా, పోలీసుల తరపున వాదించిన SPP ప్రదీప్ ఘరత్.. న్యాయవాది పొండా వాదనను వ్యతిరేకించారు. జపం చేసేది ఎక్కడైనా సరే.. ముఖ్యమంత్రి నివాసం వెలుపల అయితే కనుక వారి సమ్మతి తీసుకోవడం ముఖ్యమని అన్నారు. “హనుమాన్ చాలీసా పారాయణం హక్కు అని ఎవరైనా చెబితే, అది చట్టబద్ధమైనది, అయితే మనం ఎవరి నివాసంలో జపం చేస్తారో వారి అనుమతి, సమ్మతి తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement