Friday, April 26, 2024

Breaking: గుజరాత్ సూపర్ విక్టరీ.. పాయింట్ల పట్టికలో టాప్​లో పాగా

టాటా ఐపీఎల్2022లో భాగంగా ఇవ్వాల బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ అద్భుతంగా రాణించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్​.. కోహ్లీ (58), రజత్ పటీదార్ (52), మ్యాక్స్‌వెల్ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు గిల్ (31), సాహా (29) శుభారంభం అందించారు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (20) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (3) నిరాశ పరిచాడు. అయితే డేవిడ్ మిల్లర్ (39 నాటౌట్), రాహుల్ తెవాటియా (43 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, షాబాజ్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, పాయింట్ల పట్టికలో గుజరాత్​ టైటాన్స్​ టాప్​లో పాగా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement