Monday, April 29, 2024

వింత ఘటన: తోకతో జన్మించిన శిశువు!

బ్రెజిల్​లో ఓ శిశువు తోకతో పుట్టాడు. దీనిని చూసిన వైద్యుల ఆశ్చర్యపోయారు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్‌ సాబిన్‌ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స చేసి వైద్యులు మగ శిశువును బయటకు తీశారు. అయితే ఆ బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. 12 సెంటీమీటర్లు ఉన్న ఆ తోక చివర్లో 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది. అయితే బాలుడికి ఉన్న తోక చర్మానికి మాత్రమే పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి సంబంధం లేదని వైద్యులు గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స ద్వారా తోకను తొలగించినట్లు వారు తెలిపారు. 

కాగా, మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో 9 నెలలుగా తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ తోకను వైద్యులు నిజమైన మానవతోకగా అభివర్ణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్టోగ్రతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement