Tuesday, March 26, 2024

Bigg Boss-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

తెలుగు రియాల్టీ షో బిగ్‌ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉన్నారు. వీరిలో రవి, సన్నీ, సిరి ముగ్గురు సేవ్ అయినట్లు శనివారం హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే ఈ వారం హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ కానున్నాడని సమాచారం. మిగతా వారితో పోలిస్తే విశ్వకి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. విశ్వ తర్వాత జెస్సీకి తక్కువ ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా విశ్వ ఉన్నాడు. ఫిజికల్ టాస్క్‌లలో విశ్వను కొట్టేవాడే లేడు. అలాంటిది విశ్వ ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్టోగ్రతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement