Monday, May 6, 2024

Breaking: పొలాల్లో కూలిన ఆర్మీ ఎయిర్​ క్రాఫ్ట్​.. ఇద్దరు ట్రైనీ పైలట్లు సేఫ్​..

బిహార్​లో ఆర్మీ ఎయిర్​ క్రాఫ్ట్​ కూలిపోయింది. సాంకేతిక కారణాల వల్ల సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. గయాలోని ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఇద్దరు ట్రైనీ పైలట్‌లతో కూడిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయినట్టు సమాచారం. కాగా, ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని గయా అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ బంగాజీత్ సాహా తెలిపారు.

పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు బోధ్‌గయా బ్లాక్‌లోని ఒక గ్రామాన్ని ఆనుకుని ఉన్న పొలాల్లో ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. ట్రైనర్ విమానం కిందపడడాన్ని గమనించిన గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని క్యాడెట్లను బయటకు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది వారిని తీసుకెళ్లారు. కూలిపోయిన విమానం శిథిలాలను కూడా వారు సేకరించారు. “క్రాష్‌కు సాంకేతిక లోపమే కారణమని, దానికి సంబంధించిన వివరాలు నిపుణుల పరిశీలన తర్వాత తెలుస్తుంది” అని విమానాశ్రయ డైరెక్టర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement