Friday, April 26, 2024

ఆ భూముల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వొచ్చు

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేకరించిన భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారని షర్మిల ఆరోపించారు. ‘’మధ్యతరగతి ప్రజలు మోసపోవద్దని, రియల్ ఎస్టేట్ ధరల నుంచి రక్షణ కల్పించాలని, పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండ్ల నిర్మాణం కోసం భూములను సేకరించి 2007లో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేడు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాల్సిన ఆ భూములను కేసీఆర్ అమ్ముకొని కోట్లు కూడగట్టుకుంటున్నాడు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల్లో ఎంతో మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వొచ్చు. కానీ దొరకు అమ్ముకోవడం మీద ఉన్న శ్రద్ధ.. ఇండ్లు కట్టించడంలో లేదు. పేద ప్రజల ఆస్తులు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొంటున్న చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement