Thursday, April 18, 2024

అదృష్టం అంటే ఇత‌నిదే – పెద్ద ప్ర‌మాదం నుండి భ‌లే త‌ప్పించుకున్నాడు

అదృష్టం అంటే ఇత‌నిదే..క‌నురెప్ప మూసి, తెరిచేంత‌లో పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. జోరుగా వ‌ర్షం ప‌డుతోంది..దాంతో రోడ్లపై వెళ్ళే వాహ‌నాలు జార‌డం మామూలే. అయితే ఓ వ్య‌క్తి బైక్ పై వెళ్తుండ‌గా జారి ప‌డ్డాడు. వెన వ‌స్తోన్న ఓ ట్ర‌క్ అత‌ని వైపు దూసుకువ‌చ్చింది. ఆ వ్యక్తి పడిపోయినా కూడా.. అతని బుర్ర వేగంగా పనిచేస్తోంది. వెంటనే ఒక్క ఉదుటున లేచి పక్కకి పరిగెత్తాడు. అతను లేవడం ఒక్క సెకను ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ వీడియో చూసిన వారికి కూడా టెన్షన్ రావడం ఖాయం. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియోని మీరు చూడండి .TRT World Now అనే యూట్యూబ్ పేజీలో ఈ వీడియోని మొదట పోస్టు చేశారు. ఈ సంఘటన మలేషియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement