Sunday, May 5, 2024

ఏఆర్ రెహ‌మాన్ కుమారై పెళ్ళి – ఎప్పుడంటే

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ కుమారై ఖ‌తీజా నిశ్చితార్థం వేడుక ఘ‌నంగా జ‌రిగింది. క‌రోనా కార‌ణంగా కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య ఈ వేడుక జ‌రిగింది. కాగా ఈ నిశ్చితార్థం వేడుక ఫొటోల‌ను ఖ‌తీజా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఖతీజాని చేయందుకోబోయే వ్యక్తి పేరు రియాసిద్దీన్ షేక్ మహ్మద్. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రియాసిద్దీన్ కూడా సంగీత రంగంతో సంబంధం ఉన్నవాడే. సినీ, వినోద రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు. ఖతీజా గతంలో ‘రోబో’ చిత్రంలో ఓ పాట కూడా పాడింది. రోబో చిత్రానికి రెహమానే సంగీతం అందించారు. డిసెంబరు 29న ఖతీజా పుట్టినరోజు కాగా, అదే రోజున నిశ్చితార్థం జరిగింది. ఖతీజా, రియాసిద్దీన్ ల పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement