Friday, May 17, 2024

ఏపీ మంత్రుల‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్ – మేం ట్యాక్స్ పేయ‌ర్స్, మాకు డిస్కౌంట్ ఇవ్వండి

హీరో నాని ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అనంత‌రం వైసీపీకి చెందిన మంత్రులు నానిపై విరుచుకు ప‌డ్డారు. పారితోషికం ఎంత తీసుకుంటున్నారో వెల్ల‌డించ‌ని హీరోల‌కు టికెట్ ధ‌ర‌ల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌ని అంబ‌టి రాంబాబు అన్నారు. మరోవైపు ఈ అంశంపై హీరో సిద్ధార్థ్ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ఖర్చు తగ్గించుకుని, కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వాలని మాట్లాడే మంత్రుల్లారా… మేం ట్యాక్స్ పేయర్స్. మీ లగ్జరీల కోసం మేం పన్నులు చెల్లిస్తున్నాం. అవినీతి ద్వారా రాజకీయ నాయకులు లక్షల కోట్లు సంపాదించారు. మీ విలాసాలను తగ్గించుకుని, మాకు డిస్కౌంట్ ఇవ్వండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇదెక్కడి లాజిక్ అంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి హ్యాష్ ట్యాగ్ జత చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌లు ఎంత‌టి దుమారం రేప‌నున్నాయో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement