Sunday, May 5, 2024

వినాయకచవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. మత కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే కొన్ని షరతులను హైకోర్టు విధించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని, పబ్లిక్ స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా ఉత్సవాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement