Wednesday, May 1, 2024

రేపు ఢిల్లీకి జ‌గ‌న్ – విభ‌జ‌న హామీల‌పై మోడీతో చ‌ర్చ‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్ , విభజన హామీలపై ప్రధాన మంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విభజన హామీలపై చర్చిద్దాం అంటూ ఇటీవల తెలంగాణ, ఏపీ సీఎస్ లకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. కాగా తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఎనిమిది సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ప‌లు స‌మ‌స్య‌లు అలాగే ఉండిపోయాయి. విభ‌జ‌న జ‌రిగిన ప‌ది ఏళ్ల‌ల్లో అన్ఇన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలి. కానీ చాలా స‌మ‌స్య‌లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై జ‌గ‌న్ , మోడీ దృష్టికి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈక్రమంలో సీఎం జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈనెల 12 తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లను ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement