Tuesday, May 7, 2024

ఫొటోగ్రాఫ‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పిన అనుష్క‌శ‌ర్మ‌..

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స‌తీమ‌ణి బాలీవుడ్ తార అనుష్క ష‌ర్మ ఇండియ‌న్ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మ‌ధ్య సౌథాఫ్రికా టూర్‌కు వెళ్లే క్ర‌మంలో బ‌స్సు నుంచి దిగుతున్న కోహ్లీ, అనుష్కతో పాటు వారి గారాల కూతురు వామిక ఫొటోలు తీయ‌డానికి ఫొటోగ్రాఫ‌ర్లు ట్రై చేశారు. దీంతో కోహ్లీ వారికి ముందే పాప ఫొటోలు తీయొద్ద‌ని కోరారు. దీంతో బేబీ వామిక ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌నందుకు వారికి అనుష్క శ‌ర్మ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

‘‘మా బేబీ వామిక ఫొటోలు, వీడియోలు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా ఉండేందుకు స‌హ‌క‌రించిన ఫొటోగ్రాఫ‌ర్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇక మీద‌ట మా ఫ్యామిలీకి మీ స‌హ‌కారం ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని కోరుకుంటున్నాం. మీడియాకు, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండేలా మా పాప స్వేచ్ఛ‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాం. త‌ను పెద్ద‌య్యాకు త‌న స్వేచ్ఛ‌కు అడ్డు చెప్పం కాబట్టి ఇప్పుడు త‌న‌ను ఇలా వ‌దిలేయాల‌ని కోరుతున్నాం.’’ అని ట్వీట్ చేశారు అనుష్క శ‌ర్మ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement