Saturday, April 27, 2024

Pushpa: పుష్ప దూకుడు.. మూడో రోజూ తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ‘పుష్ప’ సినిమా కలెక్షన్ల రికార్డు బద్దలు కొడుతోంది. మూడో రోజు ‘పుష్ప’ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది అత్య‌ధిక గ్రాస్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. గత మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం రూ.173 కోట్లు సాధించిందినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. క‌రోనా స‌మ‌యంలోనూ గ‌తంలోని రికార్డుల‌న్నింటినీ ‘పుష్ప’ బ‌‌ద్ద‌లు కొడుతూ దూసుకుపోతంది. అయితే, శని, ఆదివారాలు సెల‌వు దినాలు కావ‌డంతో పుష్ప‌ను చూడ‌డానికి ప్రేక్ష‌కులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. అయితే ఈ రోజులు ఎంత వసూళ్లు చేస్తుంది అన్నది చూడాలి.

కాగా, పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆప్రభవం సినిమా కలెక్షన్ పై మాత్రం పడలేదు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement