Sunday, May 5, 2024

అంటే..సుంద‌రానికి టీజ‌ర్ రిలీజ్ – ఎప్పుడంటే

ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తోన్న చిత్రం అంటే సుంద‌రానికి. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ హీరో నాని న‌టిస్తున్నాడు. హీరోయిన్ గా న‌జ్రియా న‌జీమ్ న‌టిస్తోంది. అంటే సుందరానికి మూవీ జూన్ 10 వ తేదీన థియేటర్ల లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ టీజర్ ను ఏప్రిల్‌ 20 వ తేదీన అంటే ఎల్లుండి… ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఏప్రిల్ 20న అంటే సుంద‌రానికి టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement