Thursday, September 21, 2023

Breaking | ‘అన్నా, ఆ పోడు పట్టాల సంగతేమైంది’.. ఎమ్మెల్యే వనమాకు సీఎం కేసీఆర్​ ఫోన్​!

‘‘అన్నా.. అంతా మంచేనా. ఆరోగ్యం ఎట్లున్నది. కొత్తగూడెంలో పరిస్థితులు ఎట్లున్నయ్​. గా పోడు పట్టాల సంగతేమైంది” అని సీఎం కేసీఆర్​ ఎమ్మెల్యే వనమాను అడిగినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్​ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫోన్​ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పోడు పట్టాల గురించి ఆరా తీశారు.

- Advertisement -
   

ఇవ్వాల (మంగళవారం) రాత్రి సీఎం కేసీఆర్​ నుంచి తనకు ఫోన్​ కాల్​ వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సింగరేణి స్థలాల గురించి ఎమ్మెల్యే వనమాతో సీఎం కేసీఆర్​ చర్చించినట్టు సమాచారం. అంతేకాకుండా దశాబ్ది ఉత్సవాల నిర్వాహణకు జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే వనమాతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. కొత్తగూడెంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement