Tuesday, May 14, 2024

మ‌మ్మ‌ల్ని ఆదుకోండి – బాధితురాలి లేఖ‌పై స్పందించిన మంత్రి కేటీఆర్

సోష‌ల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఎంత యాక్టీవ్ గా ఉంటారో అంద‌రికి తెలుసు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న త‌క్ష‌ణ‌మే స్పందిస్తూ ఉంటారు. స‌మ‌స్యను బ‌ట్టి ఆయ‌న రెస్పాన్స్ అవుతుంటారు. కాగా ఓ వివాహిత రాసిన లెట‌ర్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె ఏమ‌ని రాశారంటే త‌న పేరు అనీషా అని, తాను సికింద్రాబాద్ లో ఉంటాన‌ని తెలిపారు. కాగా ఆమె భ‌ర్త కోవిడ్ వ‌ల్ల చ‌నిపోయాడ‌ని, త‌న‌కి ఇద్ద‌రు పిల్లలు, ఒక‌రికి 5సంవ‌త్స‌రాలు, మ‌రొక‌రికి 2సంవ‌త్స‌రాల‌ని లెట‌ర్ లో తెలిపారు. ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితిలో ఉండ‌టం వ‌ల్ల , ఇంటి య‌జ‌మాని త‌మ‌ని ఇల్లు ఖాళీ చేయించాడ‌ని, పిల్ల‌ల‌తో స‌హా తాను రోడ్డుపై ప‌డ్డాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దిక్కు తోచ‌ని ప‌రిస్థితుల్లో తాను ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌య‌త్నం చేశాన‌ని వెల్ల‌డించింది. టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం త‌ర‌పున త‌మ‌ని ఆదుకోవాల‌ని ఆమె లేఖ‌లో తెలిపింది. కాగా ఈ లేఖ‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మ‌హిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ‌కి బాధితురాలు రాసిన లేఖ‌ని రీ ట్వీట్ చేసి, ఆమెను ఆదుకోవాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement