Sunday, May 5, 2024

ఏపీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌!

ఏపీ స‌ర్కారు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్ ను తీసుకొస్తోంది. 2021 ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్‌ దీనిని ఆమోదించింది. ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31తో 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రస్తుత వ్యయాన్ని నిర్వహించేందుకు ఈ ఆర్డినెన్సును తీసుకువచ్చింది.

మొత్తం రూ.90 వేల కోట్లతో బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర ప‌డింది. ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో పాటు పథకాల అమలు, ఇతర వ్యయాల నిర్వహణ కోసం త‌దుప‌రి నెలల కాలానికి గాను ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకువ‌స్తున్నారు. దీంతో ఇక జూన్‌లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టే అవ‌కాశా‌లు ఉన్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement