Sunday, April 28, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్: లక్ష్మీదేవిపేట పీఏసీఎస్ భూమికి హద్దుల ఏర్పాటు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భూమికి రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల ఆధ్వర్యంలో హద్దులు నిర్ణయించారు. కొంతకాలంగా  భూమి హద్దుల విషయంలో సమస్య ఉండగా గురువారం పీఏసీఎస్ ఛైర్మన్ ఎర్రబెల్లి గోపాల్ రావు, జిల్లా సహకార అధికారి సర్దార్ సింగ్ లు ఇచ్చిన సమాచారం మేరకు  ములుగు ఆర్డిఓ, వెంకటాపూర్ తహసీల్దార్ల ఆదేశాలతో సర్వేయర్లు 2ఎకరాల 22 గుంటల పీఏసీఎస్ భూమికి హద్దులను నిర్ణయించారు. సొసైటీ  భూముల హద్దులు నిర్ణయిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిసిన సొసైటీ పరిధి పది గ్రామాలకు చెందిన రైతులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు హద్దుల వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సొసైటీని అభివృద్ధి చేసుకోవాలని డిసిఓ మాలోత్ సర్దార్ సింగ్ పాలకవర్గానికి, రైతులకు సూచించారు.

రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.  పీఏసిఎస్ భూమి హద్దుల ఏర్పాటుతో పెట్రోల్ బంక్ ఏర్పాటు,  గోదాముల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు వెంటనే జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని పిఎసిఎస్ చైర్మన్ ఎర్రబెల్లి గోపాల్ రావు సర్పంచులు, ఎంపీటీసీ లు, రైతులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement